సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా
భారతీయ సంస్కృతీ సంప్రదాయ సేవా నిరతులందరికీ సాదర స్వాగతం !
ఆధునిక కాలంలో సాంప్రదాయసిరి సమృద్ధిగా వెలగాలనే శ్రీసన్నిధానం సంకల్పానికి చేదోడుగా నిలిచే మహానీయులందరికీ మా విజ్ఞాపన.
సమాజానికి ఆధ్యాత్మిక శ్రీసూక్తిని అందుబాటుగా అందించాలని, సంప్రదాయ సేవా లక్ష్యంతో శ్రీసన్నిధానం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రపత్తి శ్రీసన్నిధానం ఆధ్యాత్మిక పత్రిక ప్రారంభించబడినది. ఆధ్యాత్మిక విషయాలను సరళంగా అందిస్తూ ఆధ్యాత్మిక భావ సంపదను అందరికి పంచాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన మాసపత్రిక ప్రపత్తి శ్రీసన్నిధానం.
ఇందులో అందరూ భాగస్వాములు కావాలని, సంప్రదాయసేవలో అందరూ పాలు పంచుకోవాలని పంచుకుంటారని ఆశిస్తున్నాము.